సుప్రీత పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆమె తల్లి సురేఖ వాణి మాత్రం ఇప్పుడే పెళ్లి చేయడానికి ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు, బ్రేకప్స్, విడాకుల కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వివాహ వ్యవస్థ అనగానే ఆమె కాస్త భయపడుతున్నారని సుప్రీత వెల్లడించింది. కానీ సుప్రీత మాత్రం తన భవిష్యత్తుపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉంది. పెళ్లి తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తాను ధైర్యంగా హ్యాండిల్ చేయగలనని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లి తర్వాత తన భర్తను తన గ్రిప్‌లో ఉంచుకుంటానని నవ్వుతూ చెప్పడం ఈ ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచింది.














