Hyderabad: ఈగలు, బల్లుల నడుమ పిండివంటల తయారీ.. హైదరాబాద్‌లో అడ్డంగా దొరికిపోయిన పేనీ వ్యాపారులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

AI Generated Image

[ad_1]

Last Updated:

Hyderabad: దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ మార్కెట్లలో మిఠాయిలు, పిండివంటల కొనుగోళ్లు జోరందుకుంటాయి.

AI Generated Image
AI Generated Image

ముఖ్యంగా పండుగ సమయాల్లో ప్రజలు అత్యంత ఇష్టంగా ఆరగించే పేనీ, బాదా, మిక్చర్ వంటి సాంప్రదాయ వంటకాల విక్రయాలు భారీగా పెరుగుతాయి. అయితే, ఇదే అదనుగా పలువురు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అపరిశుభ్ర వాతావరణంలో, ఆహార భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి వీటిని తయారు చేస్తున్న దారుణ నిజాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలోని పలు పేనీ తయారీ కేంద్రాలపై ఆహార భద్రతా విభాగం అధికారులు విస్తృత ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కల్తీ డొంకను కదిలించారు.

12 కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు

తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎమర్జెన్సీలర్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 12 ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులతో కలిసి గురువారం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. హైదరాబాద్ సౌత్ అర్బన్ పరిధిలోని జియాగూడ, అత్తాపూర్, బేగం బజార్, రాంకోట్ వంటి పలు ప్రాంతాల్లో ఉన్న 12 ప్రముఖ తయారీ, విక్రయ యూనిట్లలో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తయారీ కేంద్రాల్లోని దారుణమైన పరిస్థితులను చూసి అధికారులే నివ్వెరపోయారు.

ఈగల స్వైరవిహారం.. కల్తీ నూనె వినియోగం

పిండివంటలు తయారు చేసే ప్రాంతాల్లో తీవ్రస్థాయి అపరిశుభ్రత రాజ్యమేలుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలు ఆరబోసిన ప్రాంగణాల్లో ఈగలు ముసురుతుండటం, గోడలు, పాత్రలపై బల్లులు సంచరిస్తుండటం తనిఖీల్లో బయటపడింది. కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాల పక్కనే నిషిద్ధ గుట్కా ప్యాకెట్లు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, వాటిని అక్కడికక్కడే చెత్తబుట్టల్లో పారవేయించారు. అంతటితో ఆగకుండా, పేనీలను వేయించడానికి వాడే వంటనూనె, వనస్పతిలను ఒక్కసారి కాకుండా పదేపదే మరిగించి వాడుతున్నట్లు గుర్తించారు. నిషేధిత ప్లాస్టిక్ ప్యాక్లు, నాణ్యత లేని నూనె నిల్వ డబ్బాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5 కేంద్రాల లైసెన్సులు సస్పెన్షన్.. భారీగా పేనీ జప్తునిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న 5 ప్రధాన తయారీ కేంద్రాల ఎఫ్ఎస్ఎస్ఎఐ (FSSAI) లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. వాటి ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. లైసెన్సులు రద్దయిన వాటిలో శ్రీగణేశ్ బాదా అండ్ పేణీ (అత్తాపూర్), జేకే ఫుడ్స్ (జియాగూడ), ప్రేమ్ పురి స్వీట్ పేని షాప్ (షేక్‌బుద్వాల్), మహదేవ్ నమ్‌కీన్ (రాంకోట్), జీఎం మిక్చర్స్ (అత్తాపూర్) యూనిట్లు ఉన్నాయి.

ప్యాకింగ్‌పై సరైన లేబులింగ్ లేకపోవడం, జీర్తి రంగులు వాడారన్న అనుమానంతో దాదాపు 1,950 కిలోల పేనీని అధికారులు జప్తు చేశారు. వీటితో పాటు శివరాంపల్లి, మధుబన్ కాలనీ, మహబూబ్ గంజ్, మూసారాంబాగ్ ప్రాంతాల్లోని మరో 6 తయారీ సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాల పరిశీలన నిమిత్తం 12 రకాల ఆహార నమూనాలను సేకరించి రాష్ట్ర ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. పొంచి ఉన్న ఆరోగ్య ముప్పుఈ తరహా అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యే ఆహార పదార్థాలు తింటే ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంట పాత్రలపై తిరిగే బల్లులు, దోమలు, దుమ్ము వల్ల సాల్మొనెల్లా, ఈ-కోలీ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఆహారంలో చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయని స్పష్టం చేశారు. పండుగల వేళ ప్రజలు బయట కొనుగోలు చేసే స్వీట్లు, పేనీల నాణ్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports