Mayookha Review: మయూఖ మూవీ రివ్యూ.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన లేటెస్ట్ సినిమా మయూఖ. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ చెంగప్ప టైటిల్ రోల్ పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..

News18
News18

మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. నేరస్థుడి మైండ్‌సెట్, ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులను సులభంగా కట్టిపడేస్తాయి. సరిగ్గా అదే ఫార్ములాతో థ్రిల్ చేయడానికి వచ్చిన తాజా చిత్రం ‘మయూఖ’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మాణంలో, శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ చెంగప్ప టైటిల్ రోల్ పోషించారు. గౌతమ్ మీనన్ శైలి మర్డర్ మిస్టరీలను తలపించేలా సాగే ఈ కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:

మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగిని. రాత్రి వేళల్లో తన అపార్ట్‌మెంట్‌లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనను వెంబడిస్తున్నట్లు, భయపెడుతున్నట్లు అనిపించడంతో ఆమె ప్రాణభయంతో మరో అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. సరిగ్గా అదే సమయంలో నగరంలో ఒక సైకో కిల్లర్ మహిళలను టార్గెట్ చేసి కిడ్నాప్ చేయడం, వారి శరీర భాగాలను కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. ఆ సైకోకు ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. అతనికి సాధారణ వాసనలు ఏవీ తెలియవు, కేవలం రక్తం వాసన మాత్రమే తెలుస్తుంది. ఆ రక్తంతోనే ఒక ప్రత్యేకమైన పర్ఫ్యూమ్ తయారు చేస్తుంటాడు. మరి నగరంలో జరుగుతున్న ఈ వరుస హత్యలకు, మయూఖకు ఉన్న సంబంధం ఏమిటి? తనను వెంటాడుతున్న వ్యక్తి, ఈ సైకో కిల్లర్ ఒక్కరేనా? ఈ క్రైమ్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. కథను ప్రారంభించిన విధానం బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో బ్యాంకు కస్టమర్ల చుట్టూ, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ చుట్టూ తిరిగే సన్నివేశాలు కొద్దిగా రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అయితే, కథలో వచ్చే ప్రతి పాత్రపై అనుమానం కలిగించేలా దర్శకుడు సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. సెకండాఫ్‌లో రివీల్ అయ్యే సైకో ఫ్లాష్ బ్యాక్, అతనికి సమాజంలో ఉన్నత హోదా ఎలా దక్కిందనే విషయాల్లో సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువై లాజిక్ మిస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ, తక్కువ నిడివితో సినిమాను పరుగులు పెట్టించడం, క్లైమాక్స్‌లో హీరోయిన్ స్వయంగా సైకోను మట్టుబెట్టడం, పార్ట్-2కి లీడ్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ సినిమాకు సాంకేతిక విలువలు ప్రధాన బలంగా నిలిచాయి. సిబీ మాథ్యూ అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. పరిమిత ప్రదేశాల్లోనే షూటింగ్ జరిపినా సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా అనిపిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే, భయం, బిడియం కలగలిసిన మధ్యతరగతి అమ్మాయిగా పాయల్ చెంగప్ప తన క్యూట్ లుక్స్‌తో, సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా దేవ్ శశాంక్, సైకో తండ్రిగా మురళీధర్ గౌడ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

చివరి మాట.. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలను, తొలి భాగంలో ఉండే చిన్నపాటి ల్యాగ్‌ను పక్కన పెడితే, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘మయూఖ’ ఓ డీసెంట్ వాచ్ మూవీ.

రేటింగ్: 2.75



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports