Delhi: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు నో పర్మిషన్.. పోలీసు వలయంలో ఢిల్లీ, మెట్రో రైల్ స్టేషన్స్ మూసివేత | | ACTPnews

Delhi Protest Alert

[ad_1]

Last Updated:

Delhi:దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఆందోళనలతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత మూడ్రోజులుగా విపక్ష పార్టీలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం చేస్తున్న ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ తోడైంది. అక్టోబర్10న జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టాలని నిర్ణయించుకుంది. అయితే పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు.

Delhi Protest Alert
Delhi Protest Alert

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఆందోళనలతో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. గత మూడ్రోజులుగా విపక్ష పార్టీలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం చేస్తున్న ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ తోడైంది. అక్టోబర్10న జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టాలని నిర్ణయించుకుంది. అయితే పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. ప్రొటెస్ట్ చేయడానికి కనీసం పది రోజుల ముందు పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలనే కండీషన్‌ని సీజేపీ ముందు ఉంచారు పోలీసులు. అయితే ఏది ఏమైనా రేపు ఆందోళన చేపట్టాలనే ఆలోచనలో సీజేపీ ఉన్నట్లుగా స్పష్టం చేయడంతో ఢిల్లీలో సుమారు 57 మెట్రో స్టేషన్లకు ఎంట్రీ, ఎగ్జిట్‌లు మూసివేశారు. పలు రూట్లలో రైళ్లను క్యాన్సిల్ చేశారు.

హస్తినలో ఆరని మంటలు..

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) వివాదం అగ్గిలా రాజుకొని మంటలా ఎగసిపడుతోంది. ఇప్పటికే సీఈసీ రాజీనామా చేయాల్సిందేనంటూ ఇండియా కూటమి గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తోంది. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా అక్టోబర్‌ 10న జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ సిద్దమైంది. అయితే సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని కారణం చూపి పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టు..

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఈ ఆందోళనకు పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ అక్టోబర్‌ 7న పోలీసులకు లేఖ అందజేశారు. అయితే జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు కనీసం పది రోజుల ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ పోలీసుల నిబంధనలు చెబుతున్నాయి. గడువులోగా దరఖాస్తు చేయకపోవడంతో అనుమతి ఇవ్వలేదని పోలీస్‌ కమిషనర్‌ నూపుర్‌ ప్రసాద్‌ తెలిపారు. గతంలోనూ నీట్ పేపర్ లీక్‌పై సీజేపీ నిరసనల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

టెన్షన్ టెన్షన్..

మరోవైపు నిరసనల నేపథ్యంలో ‘ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌’ (డీఎంఆర్‌సీ)కి పోలీసులు కీలక సూచన చేశారు. అక్టోబర్‌ 9 రాత్రి 9 గంటల నుంచి సెంట్రల్‌ ఢిల్లీకి అనుసంధానమయ్యే మార్గాల్లోని 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేయాలని కోరారు. రైళ్ల రాకపోకల మధ్య వ్యవధిని కూడా పెంచాలని సూచించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే రేపు చేపట్టబోయే నిరసనలో సీజేపీతో పాటు ‘అఖిల భారత విద్యార్థి సంఘం’ కూడా తోడవడంతో ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఢిల్లీని అష్టదిగ్భందనం చేశారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports