Yash: హనుమ రెడ్డితో యష్ పాన్ ఇండియా మూవీ.. డేవిడ్ రెడ్డి రిలీజ్ కాకముందే ఈ టాక్ ఏంటి మావా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఓ ఆసక్తికర విషయం తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి రూపొందిస్తున్న దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి.. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో భారీ ప్రాజెక్టు లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

News18
News18

ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఓ ఆసక్తికర విషయం తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి రూపొందిస్తున్న దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి.. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టు లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో కొత్త టాక్ మొదలైంది. కన్నడ రాకీ భాయ్, పాన్-ఇండియా స్టార్ యష్‌తో హనుమ రెడ్డి నెక్స్ట్ మూవీ చేయబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యష్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో కొత్త దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి సినిమా అనే సరికి ఒక్కసారిగా జనం అటెన్షన్ ఈ సినిమాపై పడింది. డేవిడ్ రెడ్డి లాంటి పీరియాడిక్ యాక్షన్ కథను ఇంత భారీగా డీల్ చేస్తున్న హనుమ రెడ్డి… యష్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. యష్‌ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీ అయితే ఉంది. టాక్సిక్ తర్వాత ఆయన ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంలో ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ హనుమ రెడ్డి పేరు మాత్రం ఇప్పుడు కొత్తగా చర్చలోకి రావడం ఆసక్తిని పెంచుతోంది. మరో పాన్-ఇండియా బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా రానుందని టాక్. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు యష్ నుంచి కానీ, హనుమ రెడ్డి నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఇది డేవిడ్ రెడ్డి టీజర్, పాన్-ఇండియా స్కేల్ చూసి మొదలైన ఇండస్ట్రీ గాసిప్ అని కూడా కొందరు కొట్టిపారేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే గానీ దీనిపై ఓ క్లారిటీకి రాలేము.

ఇదిలా ఉంటే.. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న డేవిడ్ రెడ్డితో డైరెక్టర్‌గా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు హనుమ రెడ్డి యక్కంటి. బ్రిటిష్ కాలం బ్యాక్‌డ్రాప్, ఇంటెన్స్ యాక్షన్, పాన్-ఇండియా రిలీజ్.. పైగా రవి బస్రూర్, ఆచార్య వేణు, సుప్రీమ్ సుందర్ లాంటి టెక్నీషియన్స్‌తో హనుమ రెడ్డి తన మొదటి సినిమాకే భారీ స్కేల్ ఎంచుకున్నారు. కాకపోతే ఈ డేవిడ్ రెడ్డి రిలీజ్ కాకముందే డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి నెక్స్ట్ సినిమా గురించి ఈ రేంజ్ టాక్ రావడం మాత్రం ఆశ్చర్యకరమే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *