PM Modi: మీరూ బిడ్ వేయవచ్చు! పీఎం మోదీ జ్ఞాపికలను సొంతం చేసుకునే సువర్ణావకాశం! | | ACTPnews

ప్రధాని మోదీ


Last Updated:

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ పర్యటనలు, అధికారిక కార్యక్రమాల సందర్భంగా ప్రముఖులు, సంస్థలు, పౌరుల నుంచి అందిన అపురూపమైన కానుకలు, జ్ఞాపికల ఈ-వేలం ప్రక్రియ ఊపందుకుంది.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఈ-వేలంలో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ప్రత్యేక బహుమతులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న భారీ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, బిడ్ల దాఖలు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తం నిధులను పవిత్ర గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా వెచ్చించనున్నారు.

వేలంలో కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్త్రం

ప్రధాని మోదీ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనల సమయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పలు బహుమతులను అందుకున్నారు. ప్రస్తుతం వేలంలో ఉంచిన 18 కానుకల్లో ప్రధాని చిత్రంతో ప్రత్యేకంగా నేసిన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం బహూకరించిన ప్రత్యేక జ్ఞాపిక, గ్రామీణ జీవనశైలిని చాటిచెప్పే అరుదైన కళారూపం, ప్రసిద్ధి చెందిన కొండపల్లి ఎద్దులబండి కొయ్యబొమ్మ వంటివి ఉన్నాయి. తెలుగు ప్రజల కళానైపుణ్యం, సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే ఈ వస్తువులను సొంతం చేసుకునేందుకు ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో పోటీపడుతున్నారు.

భారీ ధర పలుకుతున్న అపురూప కళాఖండాలు

ఈ 8వ విడత వేలంలో దేశవిదేశాల నుంచి అందిన సుమారు 30 రకాల ప్రముఖ జ్ఞాపికలు ప్రత్యేక శ్రేణిలో ఉన్నాయి. వీటిలో పలు కళాఖండాలకు భారీగా ప్రాథమిక ధర (బేస్ ప్రైస్) నిర్ణయించారు. ఒడిశాకు చెందిన జగన్నాథ పరివార రథం ప్రతిమ బేస్ ప్రైస్ అత్యధికంగా రూ.21 లక్షలుగా ఉండగా, కర్ణాటకకు చెందిన శ్రీరాముడి వెండి విగ్రహానికి రూ.13.50 లక్షలు, తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం వెండి నమూనాకు రూ.10 లక్షల ప్రాథమిక ధరను ఖరారు చేశారు. వీటితో పాటు చారిత్రక కట్టడాల నమూనాలు, సంప్రదాయ చేతివృత్తుల ఉత్పత్తులు, దేవతా విగ్రహాలు, చిత్రలేఖనాలు, శాలువాలు వేలంలో అందుబాటులో ఉంచారు.

బిడ్లు దాఖలు చేసే విధానం

సామాన్య పౌరుల నుంచి ప్రముఖుల వరకు ఎవరైనా పారదర్శకంగా ఈ వేలంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారు అధికారిక పోర్టల్ pmmementos.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని తమకు నచ్చిన జ్ఞాపికలపై అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్ బిడ్లు వేయవచ్చని సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు. భారతదేశ ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ కానుకలను సొంతం చేసుకోవడమే కాకుండా, పవిత్ర గంగా నది సంరక్షణకు తోడ్పడే సదావకాశం ఇదని అధికారులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports