Jabardasth Comedian: నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ఆ పిల్లనే..! మరో జబర్దస్త్ కమెడియన్ పెళ్లి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రేమ కథలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. తాజాగా ఓ జబర్దస్త్ నటుడు తన లవ్ స్టోరీ సీక్రెట్స్ చెప్పడమే గాక, పెళ్లికి రెడీ అయినట్లు వెల్లడించాడు. మరి అతనెవరు? వివరాలేంటి? చూద్దామా..

News18
News18

జబర్దస్త్ వేదికపై తనదైన పంచులతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుల లిస్ట్ పెద్దదే. అందులో బాబు ఒకరు. మొదట జబర్దస్త్ లో రచయితగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బాబు, ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన ప్రేమకథ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తన కాబోయే భార్య పేరు అమూల్య అని, ఆమె ప్రస్తుతం ఓ లోకల్ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్నారని బాబు వెల్లడించారు. వీరిద్దరి పరిచయం అచ్చం ఓ రొమాంటిక్ సినిమాను తలపించేలా సాగిందట. లాక్‌డౌన్‌కు ముందు టిక్‌టాక్‌లో అమూల్య వీడియోలు చూసి బాబు మనసు పారేసుకున్నారట. అప్పటికే ఆమెకు సోషల్ మీడియాలో ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండేవారు. ఆమె వీడియోలకు లైక్స్ కొడుతూ, కామెంట్స్, మెసేజ్‌లు చేసినా అప్పట్లో ఆమె పట్టించుకోలేదు. ఒకసారి హైదరాబాద్‌లో అనుకోకుండా ఎదురుపడినా మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కాస్త పాపులర్ అయ్యాక ఎలాగోలా ఆమె నంబర్ సంపాదించి కాల్ చేయగా, బాబు మాటలు, ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె ఏకంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందట.

అయితే, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బాబు మరోసారి ప్రయత్నించి ఫోన్ చేయగా ఈసారి ఆమె సోదరుడు లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లగా అమూల్యతో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పటికి ఆమె కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడటంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, తరచూ కలుసుకోవడం ప్రారంభించారు. ఆ స్నేహం చిగురించి, అది కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. మొదట్లో తనను బ్లాక్ చేసి వార్నింగ్ ఇచ్చిన అమ్మాయే ఇప్పుడు తన జీవితభాగస్వామి కాబోతోందని బాబు ఎంతో సంతోషంగా చెప్పారు.

తన కష్టకాలంలో అమూల్య తనకు ఎంతగానో అండగా నిలిచిందని బాబు ఎమోషనల్ అయ్యారు. తన దగ్గర చిల్లిగవ్వ లేని రోజుల్లో ఆమె ఎన్నోసార్లు ఆర్థికంగా సాయం చేసిందని, మంచి క్వాలిటీతో రీల్స్ చేసుకోవడానికి, ఫొటోలు తీసుకోవడానికి తన కెరీర్‌కు ఉపయోగపడుతుందని భావించి తన ఐదు నెలల జీతం దాచిపెట్టి మరీ ఓ ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. తాను వద్దని వారించినా వినలేదన్నారు. జబర్దస్త్‌లో తాను ఎదగడానికి, దర్శకుడిగా మారడానికి ఆమె ఎంతో ప్రోత్సాహం అందించిందని తెలిపారు. కనీసం ఒక్క సినిమా అయినా చేసి, స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనేది తన కల అని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించారని, త్వరలోనే వివాహ తేదీని అధికారికంగా ప్రకటిస్తానని జబర్దస్త్ బాబు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed