మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. మంగళవారం ములుగులో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంపిణీ తీరును గణాంకాలతో సహా బయటపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదని, నెలల తరబడి రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 2018 యాసంగిలో నిధులు ఇవ్వడానికి 161 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు సమయం పట్టిందని ఆమె గుర్తు చేశారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో కేవలం 9 రోజుల్లోనే ₹9 వేల కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో వేసిందని స్పష్టం చేశారు. కేసీఆర్ తన గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని, అబద్ధాలతో ప్రజలను నమ్మించలేరని ఆమె ఎద్దేవా చేశారు.
Source link
Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










