Last Updated:
సినిమా సీన్లను మించిపోయేలా ఓ బుల్లెట్ ప్రూఫ్ లవ్ స్టోరీ సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సీన్ చూసిన నెటిజన్లు దెబ్బకు ఫ్యూజులు అవుట్ అంతే అంటున్నారు.
మన భారతీయ టీవీ సీరియల్స్ (Indian TV Serials) డైరెక్టర్లకు ఉన్న క్రియేటివిటీ ప్రపంచంలో మరెవరికీ ఉండదేమో! సైన్స్, లాజిక్, గ్రావిటీ (గురుత్వాకర్షణ శ్రేణి) లాంటి పదాలకు అస్సలు అర్థమే లేదన్నట్టుగా కొన్ని సీరియల్ సీన్లు తెరకెక్కిస్తుంటారు. గతంలో ప్లాస్టిక్ సర్జరీ సీన్లు, ల్యాప్‌టాప్‌ను డిటర్జెంట్ పౌడర్‌తో కడిగే సీన్లు చూసి జనాలు నోరెళ్లబెట్టారు. అయితే, ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయేలా ఓ బుల్లెట్ ప్రూఫ్ లవ్ స్టోరీ సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సీన్ చూసిన నెటిజన్ల ఫ్యూజులు దెబ్బకు అవుట్ అయిపోతున్నాయి.
వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్ ప్రకారం.. విలన్ గన్‌తో హీరో వైపు గురిపెట్టి బుల్లెట్ కాలుస్తాడు. గాల్లో నుంచి బుల్లెట్ అత్యంత వేగంగా దూసుకుపోతూ ఉంటుంది. సరిగ్గా అది హీరో గుండెల్లోకి దిగిపోయే క్షణంలో.. ఎక్కడి నుంచో సూపర్ ఉమెన్‌లా చేయి అడ్డం పెట్టి కాపాడుతుంది సీరియల్ హీరోయిన్. ఏకంగా ‘సౌండ్ బారియర్’ను బ్రేక్ చేస్తూ దూసుకొచ్చిన ఆ బుల్లెట్‌ను ఒంటి చేత్తో పట్టుకుని ఆపేస్తుంది! బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ మ్యూజిక్, హీరో-హీరోయిన్ల కళ్లల్లో ప్రేమాశ్రువులు.. అబ్బా, ఇదెక్కడి మాస్ క్రియేటివిటీ సామీ!
ఈ అద్భుత దృశ్యాన్ని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ.. “ఇది కదా అసలైన Z+++++ సెక్యూరిటీ అంటే!” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారడంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. దీనిపై వస్తున్న కొన్ని క్రేజీ కామెంట్లు ఇలా ఉన్నాయి:
“అసలెలా వస్తాయి సామీ మీకిలాంటి ఐడియాలు? మార్వెల్ వాళ్లు ఈమెను చూస్తే ‘అవెంజర్స్’ టీమ్‌లో చేర్చుకుంటారు!”, “ఐజాక్ న్యూటన్ బ్రతికి ఉంటే ఈ సీన్ చూసి ఉరి వేసుకునేవాడు.. సైన్స్ చచ్చిపోయింది బాబోయ్!”, “ఇకపై ఆర్మీ వాళ్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వద్దు.. ఈ హీరోయిన్ ఫోటో ఇస్తే చాలు, శత్రువుల బుల్లెట్లు ఆగిపోతాయి.” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా సినిమాల్లోనే లాజిక్స్ మిస్ అయితే కడిగేసే ఈ రోజుల్లో, డైలీ సీరియల్స్‌లో రేటింగ్‌ల కోసం డైరెక్టర్లు చేస్తున్న ఇలాంటి విన్యాసాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. గాల్లో ఎగురుతున్న బుల్లెట్‌ను చేత్తో పట్టుకోవడం అనేది ఇప్పటివరకు ఏ హాలీవుడ్ యాక్షన్ హీరో కూడా చేయని సాహసం. దాన్ని మన దేశీయ సీరియల్ హీరోయిన్ చాలా కూల్‌గా చేసి చూపించడంతో.. “ఇదెక్కడి సీరియల్ సీన్ రా బాబోయ్” అంటూ సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ నవ్వుకుంటున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













