RCB vs GT Qualifier 1: రెచ్చిపోయిన రజత్ పటిదార్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతటే? | క్రీడా వార్తలు | ACTPnews

PC : X.com


Last Updated:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు.

PC : X.com
PC : X.com

RCB vs GT Qualifier 1: గుజరాత్ టైటాన్స్ (GT vs RCB)తో ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1 పోరులో ఆర్సీబీ (RCB vs GT) భారీ స్కోరు అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిధార్ (33 బంతుల్లో 93 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) రెచ్చిపోయాడు. విరాట్ కోహ్లీ (43), పడిక్కల్ (30), కృనాల్ పాండ్యా (43) రాణించారు. ఫలితంగా ఆర్సీబీ భారీ స్కోరును సాధించింది. కగిసో రబడ, హోల్డర్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.ప్రసిధ్ కృష్ణకు ఒక వికెట్ లభించింది. ప్లే ఆఫ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించింది.  పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోయి 76 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ దంచి కొట్టారు. ఫలితంగా ఆర్సీబీ తొలి 6 ఓవర్లలో అదరగొట్టింది. అయితే 9వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జేసన్ హోల్డర్ 3 బంతుల్లో కోహ్లీ, పడిక్కల్‌లను అవుట్ చేశాడు. దాంతో ఆర్సీబీ 7 నుంచి 10 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులు చేసింది.

అయితే ఇక్కడి నుంచి పరిస్థితులు మారిపోయాయి. క్రీజులోకి వచ్చిన రజత్ పటిధార్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ పలు క్యాచ్‌లను డ్రాప్ చేసింది. రజత్ పటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను రబడ మిస్ చేశాడు. అనంతరం అతడు రెచ్చిపోయి ఆడాడు. కృనాల్ పాండ్యా కూడా అతడికి చక్కటి సహకారం అందించాడు. ఫలితంగా ఆర్సీబీ చివరి 10 ఓవర్లలో ఏకంగా 155 పరుగులు చేసింది. ఫలితంగా క్వాలిఫయర్ 1 పోరులో తిరుగులేని టార్గెట్‌ను గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది.

తుది జట్లు 

ఆర్సీబీ: రజత్ పటిధార్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హేజల్ వుడ్, డఫ్పీ, రసిక్ ధార్

గుజరాత్ టైటాన్స్ : శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, నిశాంత్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబడ, సిరాజ్, కుల్వంత్, ప్రసిధ్ కృష్ణ

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports