వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి ₹2 లక్షల కోట్లు కావాలని, అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబే 2029 కల్లా అమరావతి పూర్తి కాదని ఒప్పుకున్నారు, అలాంటప్పుడు జగన్ చెప్పినట్లు కేవలం ₹20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచన ఉత్తమమైనది” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను చూసి భయపడే ‘ఎల్లో మీడియా’ మరియు టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ట్రోలింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. మావిగన్ అంటే ఏంటో అర్థం కాని చంద్రబాబుకు ఉడా, తుడా, గుడా అంటే మాత్రం అర్థమవుతాయా అని ఎద్దేవా చేశారు.












