Ambati Rambabu | అమరావతికి ₹2 లక్షల కోట్లు ఎక్కడివి? అంబటి రాంబాబు నిలదీత | | ACTPnews

Ambati Rambabu | అమరావతికి ₹2 లక్షల కోట్లు ఎక్కడివి? అంబటి రాంబాబు నిలదీత |


Last Updated: Apr 04, 2026, 22:01 IST

వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి ₹2 లక్షల కోట్లు కావాలని, అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబే 2029 కల్లా అమరావతి పూర్తి కాదని ఒప్పుకున్నారు, అలాంటప్పుడు జగన్ చెప్పినట్లు కేవలం ₹20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచన ఉత్తమమైనది” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను చూసి భయపడే ‘ఎల్లో మీడియా’ మరియు టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ట్రోలింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. మావిగన్ అంటే ఏంటో అర్థం కాని చంద్రబాబుకు ఉడా, తుడా, గుడా అంటే మాత్రం అర్థమవుతాయా అని ఎద్దేవా చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports