IPL 2026: ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన కావ్య మారన్.. వీడియో వైరల్! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

రాజస్తాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైాదరాాబాద్ ఓటమిని ఓనర్ కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

PC: X.com
PC: X.com

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR) కథ ముగిసింది. న్యూ ఛండీగడ్ వేదికగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR vs SRH) చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓడింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఎలిమినేటర్ పోరులో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని ఓనర్ కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి వికెట్‌ను కోల్పోగానే.. తన జట్టు కథ ముగిసిందనే బాధను కావ్య మారన్ జీర్ణించుకోలేకపోయింది. స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సపోర్ట్ చేసేందుకు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌తో కరచాలనం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెను ఓదారుస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 97; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. దాంతో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరును సాధించింది.

అనంతరం ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.  తొలి ఓవర్ రెండో బంతికే అభిషేక్ శర్మ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వచ్చీ రావడంతోనే విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ కూడా తన బ్యాట్ నుంచి బౌండరీలు బాదాడు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 2.4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. ఈ స్థితిలో సన్ రైజర్స్ ఛేజ్ చేసేలా కనిపించింది. అయితే మూడో ఓవర్ 5వ బంతిని ఇషాన్ కిషన్ చెత్త షాట్ ఆడి అవుటయ్యాడు. ఇషాన్ అవుటైన తర్వాత నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లను కోల్పోయింది. స్మరన్ (1), ట్రావిస్ హెడ్ (17), క్లాసెన్ (18) అలా వచ్చి ఇలా వెళ్లారు. అయితే నితీశ్ కుమార్ రెడ్డి (38), సలీల్ అరోరా (35) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి స్కోరే చేసింది. అయితే తర్వాత లక్ష్యాన్ని మాత్రం చేధించలేకపోయింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports