Ramayana movie: ‘రామాయణ’ మూవీ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై ఫిల్మ్ సిటీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగ వ్యాపించింది.

News18
News18

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై ఫిల్మ్ సిటీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగ వ్యాపించింది. దీంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ 5న సాయంత్రం 4.02 గంటలకు ఫిల్మ్ సిటీలోని గోరేగావ్ ఈస్ట్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. రిలయన్స్ మీడియా వర్క్స్, ప్రైమ్ ఫోకస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సెట్‌లో మంటలు చెలరేగాయి. సుమారు 100×20 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెట్‌లోని పీసీఆర్ యూనిట్‌లో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

మంటల కారణంగా ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర విద్యుత్ పరికరాలు, కేబుల్స్ దెబ్బతిన్నాయి. అలాగే తలుపులు, చెక్క పలకలు, ఏసీ యూనిట్లు, వెదురు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్‌కు ఉపయోగించే పరికరాలు కాలిపోయినట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ఫైర్ సిబ్బంది దాదాపు 50 నిమిషాల పాటు శ్రమించి సాయంత్రం 4.55 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.

అయితే ‘రామాయణం’ షూటింగ్‌కు మాత్రమే కాకుండా సమీపంలోని మరికొన్ని షూటింగ్స్‌కు కూడా ఈ ఘటనతో అంతరాయం ఏర్పడింది. ‘MTV Hustle 5’, ‘Pati Patni Aur Panga 2’ షూటింగ్స్ కూడా సమీపంలోని స్టూడియోల్లో జరుగుతున్నాయి. ప్రారంభ సమాచారం ప్రకారం ‘Pati Patni Aur Panga 2’ సెట్‌లో మంటలు మొదలై, ఆ తర్వాత ‘Hustle 5’ సెట్ వైపు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సెట్లకు ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇక ‘రామాయణం’ విషయానికి వస్తే.. నితీశ్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు రవి దూబే, నమిత్ మల్హోత్రా తదితరులు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘రామాయణం’కు సంబంధించిన కార్యక్రమానికి ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ ఆయనతో ‘జై శ్రీరామ్’ అని చెప్పించారు. అలాగే శ్రీరాముడి గురించి వివరించారు.

‘రామాయణం’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports