Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


కథా నేపథ్యం: శతాబ్దాల రహస్యం.. కలియుగ ముప్పు!

కథ ప్రకారం.. శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే పౌరాణిక భూభాగంలోని మునులు, అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను అసురుల బారి నుంచి రక్షించడానికి “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడి అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని చెబుతారు.

కట్ చేస్తే ప్రస్తుత కాలంలో.. శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని వద్ద ఒక దుష్టశక్తి ఆవహించిన ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, నిజానికి పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. కొన్ని మానసిక సంఘర్షణల వల్ల కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న అతని ఆత్మ, ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) చిక్కుకుపోతుంది. మరోవైపు అసుర రాజు భూమిపై ఆధిపత్యం కోసం మేల్కొనగా, దర్వాడి తాంత్రిక తెగ ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి త్రికాలవర్మ ఆత్మను ఎలా మేల్కొలిపింది? శివకు, ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటుల ఎంపిక. వైతరణ్ అనే అత్యంత సంక్లిష్టమైన పాత్రలో నటుడు అజయ్ అద్భుత నటనను కనబరిచారు. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి పడే అంతర్మథనం, భయం, క్రూరత్వాన్ని ఆయన పండించిన తీరు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆయన కోసం డిజైన్ చేసిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. హీరో మాస్టర్ మహేంద్రన్ తన సహజసిద్ధమైన నటనతో అమాయకత్వాన్ని, ప్రేమికుడి వేదనను చక్కగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌లో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు.

సైకియాట్రిస్ట్ మాయగా శ్రద్ధా దాస్ గ్లామర్ పక్కన పెట్టి, మిస్టరీ అండ్ కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో సర్ప్రైజ్ చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. సీనియర్ నటి ఆమని తల్లి పాత్రలో భయం, బాధ, అనుమానం వంటి నవరసాలను కురిపించి, కథకు ఎమోషనల్ వెయిట్ తీసుకొచ్చారు.

దర్శకుడు మణి తెల్లగూటి విజన్..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త టెక్నికల్ ఫిల్మ్ మేకర్‌గా మణి తెల్లగూటి పేరు మారుమోగిపోతోంది. కథ రాసుకునే దశలోనే విజువల్స్, VFXను ప్లాన్ చేసుకుని హాలీవుడ్ డార్క్ ఫాంటసీ తరహా విజువల్ టోన్‌ను స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ‘ఇంక్-బ్లాక్ డార్క్ టోన్స్’ మధ్య గోల్డెన్ లైట్ బీమ్స్ ఉపయోగిస్తూ సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా అందించిన విజువల్స్ థియేటర్లలో ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా కనిపిస్తాయి. చీకటి బంగ్లాలు, తాంత్రిక శక్తులు, పురాతన గుహల వైడ్ షాట్స్ ప్రేక్షకులను ఒక భయానక లోకంలోకి తీసుకెళ్తాయి.

టెక్నికల్ హైలైట్స్:

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా, షాజిత్ హుమాయున్ (SHAJITH HUMAYUN) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ థియేటర్లలో భయాన్ని, ఉత్కంఠను రెట్టింపు చేశాయి. మాయా అండం, అసుర శక్తులు, ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే VFX మరియు CGI క్వాలిటీ అద్భుతంగా కుదిరాయి. భారీ బడ్జెట్ లుక్ వచ్చేలా క్వాలిటీతో నిర్మించిన నిర్మాత రాధికా శ్రీనివాస్ అభిరుచిని మెచ్చుకోవాల్సిందే.

చివరి మాట.. రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా, సరికొత్త మైథలాజికల్ డార్క్ ఫాంటసీని చూడాలనుకునే ప్రేక్షకులకు, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ ఇష్టపడే వారికి ‘త్రికాల’ ఒక మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు.

రేటింగ్: 3



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *