Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Pawan Kalyan: 'ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే'.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వం వైసీపీ పాలన ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ రాజధాని విషయంలో సందిగ్ధత, ఘర్షణలు జరగడం దురదృష్టకరమైన విషయం అని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. విభజన సమయంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పాలన పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పారు.

తెలుగు ప్రజలు అంతా భాషాపరంగా ఒక్కటే: 

తెలుగు ప్రజలు అంతా భాషా పరంగా ఒక్కటే అని భావిస్తున్నాని పవన్ కల్యాణ్ తెలిపారు. విభజన గాయాల నుంచి కోలుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శలు గుప్పించారు. అలాగే ఆనాటి అనాలోచిత నిర్ణయాల వల్ల నేటికీ రాజధాని కోసం కొట్టుకునే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు.

తెలుగు నేల ఎప్పుడూ ఒక్కటే: 

భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా తమ దృష్టిలో తెలుగు నేల ఎప్పుడూ ఒక్కటే అనీ, ఆంధ్ర-తెలంగాణ అనే భేద భావం తమకు లేదని ఈ సందర్భంగా పవన కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిగా దీక్షతో పని చేస్తున్నారని ఆయన కొనియాడారు.

‘తెలంగాణ వేరు, ఏపీ వేరు అనే భావన మాకు ఎప్పుడు లేదు. రాజకీయ స్థిరత్వం ఎంతో ముఖ్యం. తెలుగు నేల అనేదొక్కటే తమ భావన. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నామని, ఏపీ నేలపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కూటమిగా ఏర్పాటు అయ్యాం. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా అరాచకమే కనిపించింది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయపడేవారు, ప్రశ్నించిన అందరిపైనా దాడులకు పాల్పడ్డారు.’ అంటూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed