Peddi: పెద్దికి కలిసొస్తున్న IPL సీజన్.. బుచ్చిబాబుకు సుడి మామూలుగా లేదబ్బా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రామ్ చరణ్ హీరోగా రూపొందిన సినిమా పెద్ది. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమైన ఈ సినిమాకు ఈ IPL సీజన్ బాగా కలిసొచ్చిన అంశం అంటున్నారు. అదెలాగో చూద్దామా మరి..

News18
News18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ రూస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడానికి ఒక అద్భుతమైన కలిసివచ్చే అంశం తోడైంది. మే 31వ తేదీతో దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ (IPL) హడావుడి ముగిసిపోతుండటమే అతిపెద్ద అడ్వాంటేజ్ కానుందని జనం చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్ రేసులో ఉండటంతో క్రికెట్ ఫీవర్ దేశవ్యాప్తంగా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఒకవేళ ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చి ఉంటే, ప్రేక్షకులు, ముఖ్యంగా యువత దృష్టి ఎక్కువగా క్రికెట్ వైపు మళ్లేది. దీనివల్ల ఓపెనింగ్స్, కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం పడేది. కానీ ఐపీఎల్ ఫినాలే ముగిసిన వెంటనే, అంటే జూన్ మొదటి వారంలోనే ఈ సినిమా వస్తుండటంతో క్రికెట్ ‘దాడి’ నుంచి ‘పెద్ది’ పూర్తిగా సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ‘పెద్ది’ చిత్రం కూడా ఒక పల్లెటూరి యువకుడు క్రికెట్, రన్నింగ్, కుస్తీ వంటి క్రీడలలో రాణించే నేపథ్యంలోనే (క్రికెట్ బ్యాక్‌డ్రాప్) తెరకెక్కింది. ఐపీఎల్ సీజన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఇప్పటికే క్రీడల పట్ల, ముఖ్యంగా క్రికెట్ పట్ల విపరీతమైన మూడ్ క్రియేట్ అయి ఉంది. ఈ సహజమైన స్పోర్ట్స్ ఫీవర్ థియేటర్లలో ‘పెద్ది’ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలవడం, సినిమాకు 3 గంటల 9 నిమిషాల నిడివితో సెన్సార్ నుంచి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ రావడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. పక్కా ప్లానింగ్‌తో ఐపీఎల్ విండో ముగిసిన వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న మేకర్స్ వ్యూహం బాక్సాఫీస్ వద్ద భారీ మోత మోగించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *