Dhanush Political Entry: రాజకీయాల్లోకి హీరో ధనుష్..! స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

News18
News18

తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు రాజకీయాల ఫీవర్ గట్టిగా నడుస్తోంది. అగ్ర హీరో దళపతి విజయ్ సొంత పార్టీ పెట్టి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, అందరి దృష్టీ ఇప్పుడు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ వైపు మళ్లింది. ధనుష్ కూడా త్వరలో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు చాలా రోజులుగా బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మళ్లీ ఒక్కసారిగా తెరపైకి తెచ్చాయి. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో జీవీ ప్రకాష్ పాల్గొన్నప్పుడు, ధనుష్ పొలిటికల్ ఎంట్రీ గురించి విలేకరులు ప్రశ్నించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports