అమరావతి రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని కాలుష్య రహిత ‘బ్లూ-గ్రీన్’ సిటీగా నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారు ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ఇతరులకంటే 20 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప త్యాగం చేశారని కొనియాడారు. గతంలో తాను హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా ఎలా మార్చానో, ఇప్పుడు అమరావతిని అంతకు మించి అభివృద్ధి చేస్తానని, ఇది కేవలం నగరం మాత్రమే కాదు.. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
Source link
ChandrababuNaidu : అమరావతిలో ఉంటే 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










