Last Updated:
పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రాబోతున్న కొత్త సినిమా రోమాంచకం. కేవలం పోస్టర్ తోనే ఈ సినిమాపై సరికొత్త వైబ్స్ క్రియేట్ చేశారు.
పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
కథ వింటున్నంత సేపూ హాయిగా నవ్వుకున్నానని, వినోదంతో పాటు బలమైన ఎమోషనల్ టచ్ ఉన్నందునే మొదటిసారి ఒక సినిమాను సమర్పిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ కలర్‌ఫుల్ పోస్టర్ సరికొత్త వైబ్స్‌తో ఆకట్టుకుంటోంది. వాసుకి వైభవ్ సంగీతం, పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్-ఇండియా దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాల్లో ఉండే రఫ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి భారీ యాక్షన్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఉన్న తరుణంలో, సందీప్ వంగా అకస్మాత్తుగా ఒక చిన్న బడ్జెట్ యూత్ ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ప్రకటించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచారు.
సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా గతంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు అదే ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న రెండో చిత్రం ‘రోమాంచకం’ కావడం విశేషం. ఈ సినిమా కోసం వంగా బ్రదర్స్ టాలెంటెడ్ యంగ్ టీమ్‌ను ఎంచుకున్నారు. ‘మేం ఫేమస్’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కుర్రాళ్లను ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తుండగా, అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి టేకింగ్‌పై సందీప్ వంగా పూర్తి నమ్మకం వ్యక్తం చేయడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ క్యూరియాసిటీ నెలకొంది. డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే దీని డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం సినిమా బిజినెస్ రేంజ్‌ను తెలియజేస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 30, 2026 10:26 AM IST













