Last Updated:
Ajith Mother Demise: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది. అజిత్ తల్లి మోహిని శనివారం ఉదయం కన్నుమూశారు
Ajith Mother Demise: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది. అజిత్ తల్లి మోహిని శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
అజిత్ తల్లి మోహిని వయసు 84 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, మూడేళ్ల క్రితమే (2023లో) అజిత్ తండ్రి పి.ఎస్. సుబ్రమణ్యం కూడా వృద్ధాప్య సమస్యల వల్లే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో అజిత్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ఈ ఘోర విషాదం జరిగిన సమయంలో హీరో అజిత్ తన ప్రాజెక్ట్ పనుల నిమిత్తం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. తన తల్లి మరణవార్త తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడి నుండే అత్యవసరంగా చెన్నైకు బయలుదేరారు. అజిత్ చెన్నై చేరుకున్న తర్వాతే మోహిని గారి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
అజిత్ తల్లి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు కూడా అజిత్‌కు బాసటగా నిలుస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













