టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టినట్లు నటించారని, ఇదంతా ఒక పెద్ద నాటకమని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక అటెండర్ కూడా పట్టించుకోని వ్యక్తిగా బీఆర్ నాయుడును అభివర్ణించిన భూమన, దేవాలయ ప్రతిష్టను కాపాడాలంటే ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భగవంతుడి విషయంలో చంద్రబాబు రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు.
Source link
Bhumana Karunakar Reddy : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports








