దానికి తోడు, సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే ఒత్తిడి ఉండటంతో చిన్న చిన్న కరెక్షన్స్, అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా రిలీజ్ చేయాల్సి వచ్చిందని, అప్పట్లో సెన్సార్ ఆఫీసర్ కూడా ఈ విషయాన్ని ముందే సూచించారని రాజు గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, ఆ చేదు అనుభవం తనకు పెద్ద పాఠం నేర్పిందన్నారు. ‘దేవి పుత్రుడు’ విషయంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. ప్రతి సీన్‌ను పక్కాగా ప్లాన్ చేసి తన తదుపరి చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా ప్రభుదేవా దర్శకత్వంలో) నిర్మించానని, అది ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని ఎం.ఎస్. రాజు ఈ సందర్భంగా వెల్లడించారు.













