అంగన్‌వాడీ సర్వేలో సంచలనం.. గర్భవతులైన 55 మైనర్ బాలికలు.. ఎక్కడంటే? | | ACTPnews

News18


Last Updated:

55 Minor Pregnant Girls:మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో జరిగిన ఒక ప్రభుత్వ సర్వేలో 55 మంది వివాహిత మైనర్ బాలికలు గర్భవతులుగా ఉన్నట్లు తేలింది.

News18
News18

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో జరిగిన ఒక ప్రభుత్వ సర్వేలో 55 మంది వివాహిత మైనర్ బాలికలు గర్భవతులుగా ఉన్నట్లు తేలింది. వీరిలో ఒక అవివాహిత మైనర్ బాలిక కూడా గర్భవతి అయినట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ మైనర్ బాలికలలో కొందరు ఇప్పటికే ప్రసవం కూడా చేసినట్లు తెలుస్తోంది.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ చేసిన ఈ సర్వేతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సాధారణంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లుల వివరాలు తెలుసుకోవడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతి నెలా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తారు. అలాంటి తనిఖీల్లోనే ఈ భయానక నిజం బయటపడింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ ‘మాతృత్వ వందన యోజన’ కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించినప్పుడు కూడా గర్భిణీ మైనర్ బాలికల పేర్లు కనిపించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ ఘటన వెనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న బాల్య వివాహాల సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. చాలా కుటుంబాలు తమ కుమార్తెలు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారనే భయంతో చిన్న వయసులోనే వారిని పెళ్లి చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. కొందరు సామాజిక అవమానం, పోలీసు కేసుల భయం కారణంగా ఇలాంటి వివాహాలను బయటకు తెలియనివ్వకుండా దాచేస్తున్నారని స్థానిక నిపుణులు చెబుతున్నారు. దీంతో వాస్తవానికి నమోదైన 55 కేసుల కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మైనర్ బాలికలు ప్రభావితమై ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది.

ఈ పరిస్థితిపై అకోలే బాలల పరిరక్షణ కమిటీ అనధికార సభ్యుడు శ్రీనివాస్ రేణుకదాస్ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌తో తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్థాయి బాలల సంరక్షణ కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని, పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇద్దరి జనన ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేయాలని, మైనర్ బాలికలను వివాహం చేసుకున్న వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ ఘటన బాల్య వివాహాల ప్రమాదాన్ని మరోసారి బయటపెట్టింది. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మీద మరింత బాధ్యతతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ కేసు స్పష్టంగా చెబుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports