Bhumana Karunakar Reddy | భగవద్గీత స్కామ్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. | ACTPnews

Bhumana Karunakar Reddy | భగవద్గీత స్కామ్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం..



టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడుపై నిప్పులు చెరిగారు. తన హయాంలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. “ఈ పుస్తకంలో గీతా సారం లేదని నిరూపించినా, లేదా రూ.50 కోట్లు ఖర్చయ్యిందని చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని భూమన సవాల్ విసిరారు. అదే సమయంలో బి.ఆర్. నాయుడి వ్యక్తిగత వీడియోల వివాదాన్ని ప్రస్తావిస్తూ.. “భక్తి అంటే భామ పూజ అనుకునే వ్యక్తికి భగవద్గీత ఏం అర్థమవుతుంది?” అంటూ ఘాటుగా విమర్శించారు. అర్హత లేని వారికి అందలం ఇస్తే ఇలాగే ఉంటుందని, బి.ఆర్. నాయుడి పతనం పాతాళానికి దిగజారుతుందని మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports