Last Updated:
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ పేరుతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం కోసం రెండోసారి భూమిపూజ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ పేరుతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం కోసం రెండోసారి భూమిపూజ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సింధు తన బ్యాడ్మింటెన్ అకాడమీ కోసం గతంలో ఒకసారి భూమిపూజ చేయగా.. రెండేళ్ల తర్వాత మళ్లీ భూమిపూజ చేయడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. అయితే బుధవారం ఏపీ ప్రభుత్వ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో భూమిపూజ చేసిన తర్వాత మీడియాకు రెండో సారి భూమిపూజ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యువ అథ్లెట్లు, క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి ఒలింపిక్స్ విజేతలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విశాఖపట్నం ఆరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ‘పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ ప్రాజెక్టుకు ఏపీ మంత్రి నారా లోకేష్‌తో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. అయితే విచిత్రం 2024లో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన పీవీ సింధుకు అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పిస్తూ విశాఖ రూరల్ చినగడిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తుంచింది. అప్పటి సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆమెను అభినందిస్తూ ఏపీలో స్పోర్ట్స్ అభివృద్దికి కృషి చేయాలని ప్రోత్సహించడం కూడా జరిగింది. అదే స్తలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉత్వర్వుల్లో వెల్లడించింది. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమి ఉపయోగించాలని కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
(ఫైల్ ఫోటో)
అయితే అప్పుడు పీవీ సింధు ప్రభుత్వం తనకు కేటాయించిన రెండు ఎకరాల స్తలం విశాఖలోని పెద గదిలి కూడలి సమీపంలో 2024 నవంబర్ 7న బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధూ తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధూ భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారిపోయి కూటమి సర్కారు ఏర్పడింది. దీంతో పీవీ సింధుకు ప్రస్తుత ప్రభుత్వం అరిలోవ ప్రాంతంలో కేటాయించిన 5 ఎకరాల భూమిలో మళ్లీ ఏపీ మంత్రి నారా లోకేష్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు.
అయితే పీవీ సింధు ఏపీలో నెలకోల్పబోతున్న స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారుల పాలిట ఓ అద్భుత స్వప్నంగా మారుతుందని అంతర్జాతీయ స్థాయి వసతులతో యువ అథ్లెట్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో దీన్ని నిర్మించడం జరుగుతోందని చెప్పారు. పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ లాభోపేక్ష లేకుండా క్రీడాకారులకు ఇది ఒక వేదికగా మార్చుతానంటూ పీవీ సింధు స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయ్యమ్మా నీ వెనుక మేం ఉన్నామనే భరోసా ఇచ్చారని ఆమె చెప్పారు.
తన కలల ప్రాజెక్టును సరికొత్తగా పునఃప్రారంభిస్తున్న తరుణంలో, తనకు అత్యంత ఆప్తులైన వారు పక్కన ఉండాలనే ఉద్దేశంతోనే మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరుకావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తొలిసారి నిర్వహించిన భూమిపూజ కేవలం 7 గంటల్లో వేగంగా పూర్తైందని టైమ్‌లో తన ఫ్యామిలీతో పాటు సన్నిహితులు, గ్రీన్కో ప్రతినిధులు అనిల్, స్వాతి వంటి శ్రేయోభిలాషులు హాజరుకాలేకపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో ఈ ప్రాజెక్టు పరిధిని మరింతగా విస్తరించినట్లు వెల్లడించారు.
అయితే విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండో సారి భూమిపూజ చేయడం అనేక మందికి అనుమానాన్ని కలిగించింది. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో దీనిని అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. యువ అథ్లెట్లకు అవసరమైన ఏడు రకాల క్రీడా విభాగాలు, ఉన్నత స్థాయి శిక్షణ, రికవరీ సదుపాయాలు, పోషకాహారం, శారీరక దృఢత్వం లాంటి కీలక అంశాలకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు.అనేక సంస్థల స్ఫూర్తితో విశాఖ కేంద్రాన్ని దీన్ని తీర్చిదిద్దుతున్నారు. నాణ్యమైన శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, విద్యా సంస్కృతిని ఒకేచోట అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇక్కడి నుంచే తయారవుతారనే బలమైన విశ్వాసంతో దీని రూపకల్పన జరిగింది. ఈ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేకమైన బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా 25 మీటర్ల షూటింగ్ రేంజ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Aug 06, 2026 10:59 AM IST














