గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, బుధవారం (జూన్ 3) యూఎస్ఏతో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లగా, తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న ‘ఇన్‌సైడ్ రిపోర్ట్’ సినిమా రేంజ్‌ను స్పష్టం చేస్తోంది.













