Last Updated:
అనుకున్న డేట్‌కు ఒక రోజు ఆలస్యంగా రిలీజైన రికార్డులను మాత్రం ఆన్ టైమ్‌లో పెట్టేస్తున్నాడు సూర్య. లాస్ట్ వీక్ రిలీజైన వీరభద్రుడు సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
అనుకున్న డేట్‌కు ఒక రోజు ఆలస్యంగా రిలీజైన రికార్డులను మాత్రం ఆన్ టైమ్‌లో పెట్టేస్తున్నాడు సూర్య. లాస్ట్ వీక్ రిలీజైన వీరభద్రుడు సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆరే.బాలాజీ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు లాస్ట్ గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది.
అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న టైమ్‌లో రిలీజ్ రోజున ఈ సినిమాకు అసలు చిక్కు ఎదురైంది. కొన్ని కారణాల వల్ల ఎక్కడ కూడా ఈ సినిమా షోలు పడలేదు. ఆలా గురువారం రిలీజ్ కావాల్సిన సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాములు ఆడియెన్స్ వన్ టైమ్ వాచ్ అని రివ్యూలు ఇచ్చినా.. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా అనిపించిందని చెబుతున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం విరుచుక పడుతుంది.
ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియా వైడ్‌గా ఈ సినిమా రూ.78 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్‌లో రూ.42 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.120 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ దిశగా దూసుకపోతుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన షేర్ రూ.60 కోట్లకు పైనే. అంటే మరో రూ.10 కోట్లు కొల్లగొడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది.
దత్త పుత్రుడు అంటూ సూర్యను ముద్దుగా పిలిచుకునే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లు రాబడుతుంది. దాదాపు రూ.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడు రోజులు పూర్తయ్యే సరికి రూ.4.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అంటే ఇంకో రూ.2.5 కోట్లు కలెక్ట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్‌కు ఆ టార్గెట్‌ను ఈజీగా రీచ్ అయిపోయింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగతనం జరిగిన తన నగలను రికవరీ చేసుకోవడానికి ఒక నిరుపేద తండ్రి పడే ఆరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అవినీతిమయమైన న్యాయ వ్యవస్థ, స్వార్థపరుడైన లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) వల్ల ఆ తండ్రికి అన్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో నాంపల్లి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు (సూర్య) స్వయంగా భూమిపైకి వచ్చి బాధితుడి తరపున ఎలా పోరాడారు? కోర్టులో దేవుడు చేసిన వాదనలేంటి? అన్నదే ఈ సినిమా కథ…
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 18, 2026 12:48 PM IST













