ByGanesh
Fri 21st Jul 2023 12:14 PM
మెగాస్టార్ చిరు ఈమధ్యన చిరు లీక్స్ అంటూ అందరిలో ఉత్సుకత కలిగిస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల నుండి డైలాగ్స్ ని లీక్ చెయ్యడం, వీడియోస్ లీక్ చెయ్యడం వంటివి అన్నమాట. గతంలో గాడ్ ఫాదర్ నుండి ఆయన పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసారు. తర్వాత వాల్తేర్ వీరయ్య నుండి.. శృతి తో ఆడిపాడిన సాంగ్ గురించి లీక్ చేసారు.. ఇప్పుడు భోళా శంకర్ నుండి తాను పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన సాంగ్ ని లీక్ చేసారు. అలా మెగా లీక్స్ అంటూ చిరు తెగ వైరల్ చేస్తున్నారు.
అదే బాటలో ఇప్పుడు అల్లు లీక్స్ మొదలయ్యాయి. అల్లు లీక్స్ అంటే అల్లు అర్జున్ తన సినిమా డైలాగ్ ని సుకుమార్ పర్మిషన్ లేకుండా లీక్ చేసి అందరిలో అంచనాలు పెంచేసాడు. రీసెంట్ గా జరిగిన బేబీ మూవీ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆయన నటిస్తున్న పుష్ప ద రూల్ నుండి డైలాగ్ లీక్ చేసి ఫాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ నుండి అల్లు అర్జున్ బర్త్ డే రోజు వదిలిన వీడియో తప్ప ఇప్పటివరకు ఓ అప్ డేట్ కూడా లేదు. కానీ అల్లు అర్జున్ ఇలా సడన్ గా బేబీ ఈవెంట్ లో పుష్ప డైలాగ్ లీక్ చేసాడు.
పుష్ప2 గురించి అప్డేట్ ఇవాల్సి వస్తుందనుకోలేదు. చిరు లీక్స్ లాగే నేను ఓ డైలాగ్ లీక్ చేస్తున్నాను. ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతండాది.. పుష్ప గాడి రూల్ అంటూ పుష్ప 2 నుండి పవర్ ఫుల్ గా డైలాగ్ ని లీక్ చేసాడు అల్లు అర్జున్. ఇది చూసిన నెటిజెన్స్ ఇంట్రెస్టింగ్ చిరు లీక్స్ తర్వాత అల్లు లీక్స్ తెగ వైరల్ అవుతున్నాయిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Interesting: Mega leaks-Allu leaks :
Allu Arjun Leaks Pushpa The Rule Dialogue