PM Modi | ఎన్డీయే వచ్చాకే ప్రజల్లో నమ్మకం పెరిగింది | ACTPnews

PM Modi | ఎన్డీయే వచ్చాకే ప్రజల్లో నమ్మకం పెరిగింది



ప్రధానిగా విజయవంతంగా పన్నెండేళ్లు (నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రోజులు) పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించిన తరుణంలో.. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీయే కూటమి కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు మరియు అనేక తీవ్రమైన సమస్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రూపురేఖల్లో పెను మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే దేశ ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరిగిందని, దేశాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు బలంగా కోరుకున్నారని పేర్కొన్నారు. ఈ భారీ విజయం ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలదేనని చెబుతూ దేశ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports