Last Updated:
కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు సినిమా రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్‌ను గమనిస్తే ఎన్నో అంశాలను మేళవంచి తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించారు. టీజర్ చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది. మురళీధర్ గౌడ్ డైలాగ్స్ కామెడీగా ఉన్నాయి. హీరో హీరోయిన్ల ట్రాక్. ట్రైన్‌లోని అమ్మాయి.. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కూడా ఆసక్తిని పెంచేశాయి. ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్, కంటెంట్ మూవీని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.
ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ను అలరించనున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













