Ujjal Biswas Attacked With Eggs |ఇంట్లోకి చొరబడి మరీ..మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి | | ACTPnews

Ujjal Biswas Attacked With Eggs |ఇంట్లోకి చొరబడి మరీ..మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి |


Last Updated: Jun 10, 2026, 16:54 IST

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది! తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ (Ujjal Biswas) నివాసమే వేదికగా అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ప్రభుత్వానికి సంబంధించిన వరద సహాయక సామాగ్రిని (తార్పాలిన్లు, దుస్తులు) తన ఇంట్లో అక్రమంగా దాచారంటూ కృష్ణనగర్లోని ఆయన ఇంటిపైకి స్థానికులు, విపక్ష కార్యకర్తలు భారీగా దూసుకెళ్లారు. నేరుగా ఆయన ఆఫీస్ గదిలోకి చొరబడి, తీవ్రంగా దూషిస్తూ ఉజ్జల్ బిస్వాస్ ముఖంపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఘటనా స్థలానికి చేరుకున్న కొత్వాలి పోలీసులు.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆయన్ను స్టేషన్కు తరలించి, ప్రభుత్వ సామాగ్రి దుర్వినియోగం కేసులో అర్ధరాత్రి అధికారికంగా అరెస్ట్ చేశారు. ఆ షాకింగ్ వైరల్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports