Last Updated:
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్ సినిమాపై ఓపెన్ కామెంట్స్ చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, సినిమాలు, జాతీయవాదం లాంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాశ్మీర్ అంశాలు, అలాగే సౌత్-నార్త్ సినీ పరిశ్రమల మధ్య ఉన్న సంబంధాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ధురంధర్, బారాముల్లా చిత్రాల గురించి పవన్ కళ్యాణ్ ఓపెన్ గా మాట్లాడారు.
‘ధురంధర్’ చిత్రంపై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమాలోని ధైర్యమైన కథనం, ఆ బోల్డ్ నెస్, దర్శకుడి మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. అయితే, ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధికారిక బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ‘ధురంధర్ 2’ చిత్రాన్ని ఇంకా పూర్తిగా చూడలేకపోయానని ఆయన వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలతో ఈ సినిమా సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
అనంతరం పవన్ కళ్యాణ్ ‘బారాముల్లా’ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ చిత్రం తనను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. తనకు రాత్రి పూట నిద్రపట్టని సమయంలో హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందని, ఆ క్రమంలోనే ఒక రాత్రి ‘బారాముల్లా’ సినిమా చూశానని చెప్పారు. కాశ్మీర్ నేపథ్యం, అక్కడి పరిస్థితులు, ముఖ్యంగా కాశ్మీరీ పండితుల వేదనను దర్శకుడు ఎంతో హృదయవిదారకంగా, ప్రభావవంతంగా చూపించారని కొనియాడారు.
ఈ సినిమాతో తనకు ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడటానికి గల కారణాన్ని కూడా పవన్ బయటపెట్టారు. గతంలో సినిమా షూటింగ్‌ల కోసం తాను కాశ్మీర్ వెళ్లినప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. అక్కడ స్థానికంగా కొందరు “ఇక్కడి నుంచి వెళ్లిపోండి” (గెట్ అవుట్) అని అన్నారని, ఆ మాటలు తనకు అస్సలు నచ్చలేదని చెప్పారు. ఆనాటి చేదు జ్ఞాపకాలు, భావోద్వేగాల వల్లే ‘బారాముల్లా’ చిత్రంలోని సంఘటనలు తన మనసుకు బాగా దగ్గరయ్యాయని వివరించారు.
ఆదిత్య ధర్ నిర్మాణంలో, దర్శకుడు ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించిన ‘బారాముల్లా’ చిత్రం ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. కాశ్మీర్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీవ్రవాదం, పోలీస్ దర్యాప్తు, ఆత్మల నేపథ్యం మరియు కాశ్మీరీ పండితుల సమస్యల చుట్టూ ఈ కథ నడుస్తుంది. గత ఏడాది నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశంసలతో దేశవ్యాప్తంగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













