T20: టీ20 ప్రీమియర్ లీగ్‌లో భారీ ధర పలికిన ఆదిలాబాద్ కుర్రాడు.. 523 పరుగులతో సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు తమ ప్రతిభతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించగా, అందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ ప్రత్యేకంగా నిలిచాడు.

News18
News18

తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు తమ ప్రతిభతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించగా, అందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ ప్రత్యేకంగా నిలిచాడు. ఖమ్మం ఏసెస్ జట్టు హిమతేజను రూ.8 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీజీ 20 ప్రీమియర్ లీగ్‌లో ఆయన ఖమ్మం జట్టు తరఫున బరిలో దిగనున్నాడు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన మధుసూదన్, కామేశ్వరి దంపతుల కుమారుడైన హిమతేజ చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపించాడు. తొలుత స్థానికంగా గల్లీ క్రికెట్ ఆడుతూ ఆటలో మెలకువలు నేర్చుకున్న ఆయన తర్వాత పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లోనూ ఆయన మంచి ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.

హిమతేజ ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు మరింత శిక్షణ అవసరమని భావించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో నడుస్తున్న క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అక్కడ శిక్షణతో పాటు క్రమశిక్షణ, ఆటతీరు, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం వంటి అంశాల్లో మెరుగుపడిన హిమతేజ, క్రమంగా తన ఆటను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. అంచలంచెలుగా ఎదుగుతూ ఇటీవల హైదరాబాద్ రంజీ జట్టులో చోటు సంపాదించడం ఆయన కెరీర్‌లో పెద్ద మైలురాయిగా నిలిచింది.

రంజీ జట్టుకు ఎంపికైన తర్వాత హిమతేజ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 523 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే ఆయన స్థిరత్వం, దూకుడుతో పాటు మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. రంజీ జట్టుకు చేరకముందు కూడా హిమతేజ పలు రాష్ట్ర స్థాయి, ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన టోర్నమెంట్లలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే ఆయనపై ఫ్రాంచైజీల ఆసక్తి పెరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొన్నట్లు సమాచారం. ప్రతిభావంతులైన ఆటగాళ్లను దక్కించుకోవడానికి జట్లు పోటాపోటీగా బిడ్‌లు వేసినట్టు తెలిసింది. ఈ వేలంలో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయినప్పటికీ ఆదిలాబాద్ యువకుడు హిమతేజను ఖమ్మం ఏసెస్ జట్టు భారీ మొత్తానికి దక్కించుకోవడం విశేషంగా మారింది.

ఇక ఈ నెల 21 నుంచి మొదలుకానున్న టీజీ 20 ప్రీమియర్ లీగ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఈ టోర్నీ ద్వారా మరికొందరు ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హిమతేజ లాంటి యువ క్రీడాకారులు ఈ వేదికపై రాణిస్తే, తెలంగాణ క్రికెట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారడం ఖాయం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports