కొత్తగా కుదిరే డీల్‌లో కొన్ని కీ పాయింట్లు ఉన్నాయి. కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఛాన్స్ ఉంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచి, చమురు సరఫరానీ, నౌకల రవాణాని ఈజీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇకపై అణు కార్యక్రమంపై చర్చలు సాగొచ్చు. ఇరాన్‌పై ఆంక్షల్ని అమెరికా దశలవారీగా ఎత్తివేసే ఛాన్స్ ఉంటుంది. అమెరికా గెలిచినా, ఇరాన్ గెలిచినా.. అల్టిమేట్‌గా యుద్ధం ముగిసి, హార్ముజ్ ఓపెన్ అయితే.. అది ప్రపంచానికే మంచిది. దాని వల్ల చమురు ధరలు తగ్గి.. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గగలవు. ఆ రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త 24 గంటల ప్రకటనపై ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది. యుద్ధం ఆగిపోతే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది? (Image: Reuters)













