Feel My Love: పాన్ ఇండియా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘ఫీల్ మై లవ్’.. టైటిల్ పోస్టర్ విడుదల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

News18
News18

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఈ సారి ఓ అద్భుతమైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌‌గా రూపొందిన ‘ఫీల్ మై లవ్’ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరగొచ్చు అనే కాన్సెప్ట్‌తో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఫీల్-గుడ్ కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.

తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ రిలీజ్ చేశారు. ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ కూడా ఎంతో ఫీల్ ఇచ్చేలా ఉంది. ఇదొక అందమైన ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథనంతో రాబోతోంది. చెన్నై, పుదుచ్చేరిలోని అద్భుతమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. చివరి షెడ్యూల్‌ను అద్భుతమైన హిల్ స్టేషన్ అయిన మున్నార్‌లో షూట్ చేయనున్నారు. ఇది కథనానికి విజువల్ గ్రాండియర్‌ను, ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.

ఎం.ఎస్. సతీష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే ఓ భారీ ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టీం సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports