Last Updated:
Software Engineer Death: ముస్సోరిలోని ఓ హోటల్ గదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. రాధా గాయత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. విశాఖపట్నానికి చెందిన ఈ దంపతులు ఉత్తరాఖండ్ పర్యటన కోసం ఢిల్లీ నుంచి వచ్చారు. ముస్సోరీ-ధనౌల్తి రోడ్డులోని ఒక హోమ్‌స్టే అయ్యారు. మృతురాలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ (NCR) ప్రాంతంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు.
Software Engineer Death: తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ముస్సోరీలోని ఒక హోమ్‌స్టేలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సంచలనంగా మారింది. గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. రాధా గాయత్రి సోమవారం చనిపోగా మృతదేహానికి ఈరోజు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఈ పోస్ట్‌మార్టంను నిర్వహిస్తుంది. విశాఖపట్నం వాస్తవ్యురాలైన పి. రాధా గాయత్రి తన భర్తతో కలిసి పర్యటన నిమిత్తం ముస్సోరీకి వచ్చారు. ఈ దంపతులు గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాధా గాయత్రి అనుమానాస్పదమృతి కేసు దర్యాప్తులో భాగంగా భర్తను విచారిస్తున్నారు పోలీసులు. ఘటన స్థలంలో క్లూస్, బాధితురాలికి సంబంధించిన వస్తువులను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఆమె భర్తతో కలిసి ముస్సోరిలోని హోమ్‌స్టేకి చేరుకున్నారు. అయితే పోలీసుల కథనం ప్రకారం సోమవారం గదిలో మహిళ మృతదేహం నగ్నంగా లభ్యమైంది. మంచంపై రక్తపు మరకలు కనిపించాయి. సంఘటనా స్థలం నుంచి ఖాళీ మద్యం సీసాలు, ఇతర ముఖ్యమైన ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం ఉపయోగపడే పోస్ట్‌మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులోని అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోందని ముస్సోరీ పోలీసులు తెలిపారు.
పి. రాధా గాయత్రి మృతదేహానికి ఈరోజు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. విశాఖపట్నం వాస్తవ్యులైన ఈ దంపతులు పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వచ్చారు. మసూరీ-ధనౌల్టి రహదారిపై ఉన్న ఒక హోమ్‌స్టేలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ మరణం సంభవించింది. మృతురాలు ఢిల్లీ-ఎన్సీఆర్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైద్యుల బృందం వీడియో రికార్డ్ చేస్తూ పోస్ట్‌మార్టం నిర్వహించనుంది. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి పర్యటనకు వచ్చింది. వారికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి తన భార్య అపస్మారక స్థితిలో పడి ఉందని భర్త చెబుతున్నారు. ఇద్దరూ ఐటీ నిపుణులే. భార్య గురుగ్రామ్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తుండగా, భర్త పుణెలో పనిచేస్తున్నారు.
అయితే వీరిద్దరి 8నెలల కాపురంలో ఏదైనా మనస్పర్ధలు తలెత్తాయా లేక వృత్తిపరమైన పరిచయాలు ఏమైనా ఇద్దరి మధ్య విభేదాలకు కారణం అయ్యాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాధ గాయత్రి మరణ వార్తను విశాఖపట్నంలోని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు.
Hyderabad,Telangana
Jun 16, 2026 11:22 AM IST













