Last Updated:
ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా రిస్క్. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఆడియన్స్ కి క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా..
జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ “రిస్క్” ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ చిత్రంలోని మెలోడీయస్ సాంగ్ “దేవుడు వరమందిస్తే” ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ పాటతో పాటు సినిమాకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు గంతాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వ, నిర్మాతలు రవి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు, కో-ప్రొడ్యూసర్ గడ్డం రవి కుమార్, కో-డైరెక్టర్ బన్సీ కోయల్ కార్ పాల్గొన్నారు. అలాగే “దేవుడు వరమందిస్తే” పాటకు సంబంధించిన హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది.
ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
రావి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సహ నిర్మాత: గడ్డం రవి కుమార్.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













