Pawan Gifts Tab And Puppy To Fan Niranjan : నిరంజన్ కోరిక తీర్చిన పవన్..! | ACTPnews

Pawan Gifts Tab And Puppy To Fan Niranjan : నిరంజన్ కోరిక తీర్చిన పవన్..!



తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతని చిన్న కోరికలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. నిరంజన్కు ఒక ట్యాబ్, అలాగే ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక ఉందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు అతని ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టాడు. తన కోరికలు నెరవేరడంతో నిరంజన్ ముఖంలో కనిపించిన ఆనందం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అభిమానుల సంతోషాన్ని తన సంతోషంగా భావించే పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *