Last Updated:
రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా ఓ సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాను అధికారికంగా స్టార్ట్ చేశారు.
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ వేడుకకు వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో- ప్రొడ్యూసర్స్, రామ్ భరదరం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ భాద్యతలు చేపడుతున్నారు.
నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథకు కాస్త క్రిస్పీ యాంగిల్ యాడ్ చేసి ఈ సినిమాను రూపొందించనున్నారు. లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్ ను ఫ్యామిలీస్ ను ఆకట్టుకొనేలా తీయ్యాబోతున్నారు దర్శకుడు రామ్ భరదరం. సింగపూర్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు అలాగే హైదరాబాద్, చీరాల లో టాకి పార్ట్ తీయబోతున్నారు.
ఈ సినిమాకు ప్రసాద్ ఈదర కెమెరామెన్, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు, మాటలు మరుదూరి రాజా, ఎడిటర్ నందమూరి హరి, ఫైట్స్ అవినాష్. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














