Last Updated:
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రోహిత్ దంపతులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.
నారా వారి ఫ్యామిలీలో కొత్త ఆనందం వెల్లివిరిసింది. నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు, టాలీవుడ్ యంగ్ అండ్ విలక్షణ నటుడు నారా రోహిత్ (Nara Rohit) తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సిరి లేళ్ల (Siri Lella) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే వేడుకగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ క్రేజీ కపుల్, ఇప్పుడు తమ జీవితంలోకి సరికొత్త బుజ్జి అతిథిని ఆహ్వానిస్తూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
ఈ శుభవార్త తెలియడంతో అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. నారా, నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’ వంటి వైవిధ్యభరితమైన కథాంశాలతో, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్. ఆయన గతేడాది పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సహనటి అయిన సిరి లేళ్లతో ఆయనకు పరిచయం ఏర్పడింది. షూటింగ్ లొకేషన్‌లో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలో ఈ జంట ఎంతో వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన కొద్ది కాలానికే ఈ దంపతుల జీవితంలోకి ఒక చిన్ని వారసుడు అడుగుపెట్టడంతో నారా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.
శుభాకాంక్షల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా నందమూరి కుటుంబ సభ్యులు నారా రోహిత్-సిరి లేళ్ల దంపతులకు తమ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు యంగ్ హీరోలు, దర్శకులు మరియు నిర్మాతలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ‘మెగా అప్‌డేట్’పై స్పందిస్తూ, బాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించిన నారా రోహిత్ కెరీర్ పరంగా కూడా మరింత సక్సెస్ సాధించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













