Raja The Raja: రుత్విక్, విశాఖ ధిమాన్ ‘రాజా ది రాజా’.. జూలై 17న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా జూలై 17న గ్రాండ్ రిలీజ్ కానుంది.

News18
News18

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు.

తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు. కలర్ ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ ఉత్సాహంగా, ఎనర్జీతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి ప్రముఖ పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది. విడుదల తేదీ ఖరారవడంతో పాటు ప్రమోషన్స్ కూడా వేగం పుంజుకున్నాయి. చిత్ర బృందం ప్రచారం ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉంది. ‘రాజా ది రాజా’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports