Pune Murder Case: పుణె కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. FIRలో బయటపడిన భిన్న కోణాలు | | ACTPnews

ముందే అనుకున్న సిగ్నల్.. పక్కా ప్లాన్ ప్రకారం లోయలోకి: ఈ హత్యలో ఎలాంటి ఆధారాలూ వదలకుండా పక్కా ప్లాన్ రచించారు. కేతన్‌ను హత్య చేయడానికి ముందుగానే సియా, చేతన్ ఇద్దరూ ఒక సిగ్నల్ (సంకేతం) కూడా సెట్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం, ఏమీ ఎరుగని కేతన్‌తో కలిసి సియా నడుచుకుంటూ వెళ్లి, అనుకున్న ప్రదేశంలో ఆమె కింద కూర్చోగానే, వెనుక నక్కి ఉన్న చేతన్ చౌదరి వచ్చి కేతన్‌ను లోయలోకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన మహారాష్ట్రలోని మావల్ తాలూకాలో ఉన్న లోహగడ్ కోట (Lohagad Fort) దగ్గరకు వెళ్లినప్పుడు, వారు అనుకున్న విధంగానే సియా కిందకు కూర్చోవడం, వెంటనే చేతన్ వచ్చి కేతన్‌ను 350 అడుగుల లోతైన లోయలోకి తోసేయడం క్షణాల్లో జరిగిపోయాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. "కేతన్‌కు అసలు ఏం జరుగుతుందో ఊహించే అవకాశం కూడా దొరకలేదు. అతనికి ఏమీ అర్థం కాకముందే లోయలోకి తోసేసినట్లైంది" అని పోలీసు వర్గాలు తెలిపాయి.

 కాబోయే భార్య అడగడంతో.. కేతన్ ఆ కోటకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అది ప్రాచీన కోట. దాని పక్కనే 400 అడుగుల లోయ ఉంటుంది. ఆమెకు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం కావచ్చు అని అనుకున్నాడు. తనతో ఆ కోటకు వెళ్లాలని కోరిక ఉందేమో అనుకున్నాడు. కానీ.. సియాపై కేతన్ తల్లికి ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఆమె ఈ కోట ట్రిప్‌కి బ్రేక్ వేసింది. జూన్ 4న ఈ కోటకు వెళ్లాలని కేతన్, సియా అనుకున్నారు. కానీ కేతన్ తల్లి బ్రేక్ వెయ్యడంతో.. సియా తీవ్ర అసంతృప్తి చెందింది. ఆ తర్వాత ఆమెలో మార్పులు మరింత ఎక్కువగా కనిపించాయి. కోపం, ఆవేశం, ఏదో తెలియని ఇబ్బంది, చీటికీ మాటికీ చిరాకుపడటం.. ఇలాంటి లక్షణాలు డెవలప్ అయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports