కాబోయే భార్య అడగడంతో.. కేతన్ ఆ కోటకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అది ప్రాచీన కోట. దాని పక్కనే 400 అడుగుల లోయ ఉంటుంది. ఆమెకు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం కావచ్చు అని అనుకున్నాడు. తనతో ఆ కోటకు వెళ్లాలని కోరిక ఉందేమో అనుకున్నాడు. కానీ.. సియాపై కేతన్ తల్లికి ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఆమె ఈ కోట ట్రిప్‌కి బ్రేక్ వేసింది. జూన్ 4న ఈ కోటకు వెళ్లాలని కేతన్, సియా అనుకున్నారు. కానీ కేతన్ తల్లి బ్రేక్ వెయ్యడంతో.. సియా తీవ్ర అసంతృప్తి చెందింది. ఆ తర్వాత ఆమెలో మార్పులు మరింత ఎక్కువగా కనిపించాయి. కోపం, ఆవేశం, ఏదో తెలియని ఇబ్బంది, చీటికీ మాటికీ చిరాకుపడటం.. ఇలాంటి లక్షణాలు డెవలప్ అయ్యాయి.













