Last Updated:
రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా పెద్ది థియాట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్ది ఓటీటీ రిలీజ్ పై కీలక సమాచారం బయటకొచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ కేవలం కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ సినిమా ఆడుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే ఈ కథలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి రా అండ్ రస్టిక్ లుక్‌లో చరణ్ కనిపించడం, తన పాత్ర కోసం శారీరకంగా మేకోవర్ అయిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయిందని, ఫస్ట్ హాఫ్‌లో జాన్వీతో సాగే ట్రాక్ నెమ్మదించిందని విమర్శలు వచ్చినప్పటికీ.. చరణ్ తన అద్భుతమైన యాక్టింగ్‌తో సినిమాను తన భుజాలపై మోశాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రామ్ చరణ్ పాన్ ఇండియా స్టామినాను మరోసారి నిరూపించింది.
సాధారణంగా ఇటీవల విడుదలవుతున్న పెద్ద సినిమాలు సైతం కేవలం నాలుగు వారాల (28 రోజులు) థియేట్రికల్ విండోను పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో ‘పెద్ది’ కూడా ఇదే వీకెండ్లో ఓటీటీలోకి వస్తుందని అంతా ఆశించారు. కానీ మేకర్స్ ఈ సినిమాకు 42 రోజుల విండో ఒప్పందం చేసుకున్నట్లు తాజా సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం జూలై 16 నుంచి తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో (తమిళ, కన్నడ, మలయాళ) నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగా, అంటే జూలై 30 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ వీకెండ్లో మూవీ లవర్స్‌ను అలరించేందుకు మరికొన్ని కంటెంట్స్ సిద్ధంగా ఉన్నాయి. డబ్బింగ్ మూవీస్ ‘అబ్సెషన్’, ‘మాలీవుడ్ టైమ్స్’ తో పాటు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు ‘సూపర్ సుబ్బు’, ‘ఇసకపట్నం’ తదితర ప్రాజెక్టులు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా ఈ వీకెండ్లో వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో 15కి పైగా సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













