Last Updated:
రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ టాక్సిక్. తాజాగా ఈ సినిమా హీరోయిన్లను పరిచయం చేస్తూ బోల్డ్ వీడియో రిలీజ్ చేశారు.
కేజీఎఫ్ సిరీస్ సృష్టించిన సునామీ తర్వాత, పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ (Toxic). ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే టాగ్ లైన్ తో మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కుతోంది. తాజాగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తూ, చిత్ర బృందం ఒక మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇందులోని పవర్ఫుల్ మహిళా పాత్రలను పరిచయం చేస్తూ ‘లేడీస్ అండ్ లేడీస్’ (Ladies & Ladies) పేరుతో ఒక బోల్డ్ వీడియోను విడుదల చేశారు.
ఈ ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ ఊహించని విధంగా అత్యంత బోల్డ్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో డిజైన్ చేశారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో లేడీస్ అందరినీ చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని అగ్రెసివ్ అవతార్లలో నటీమణులు షాక్ ఇచ్చారు. గతంలో యష్ లుక్‌ను రివీల్ చేసినప్పుడు వాడిన ‘డాడీ ఈజ్ హోమ్’ (Daddy is home) అనే డైలాగ్ ఎంతటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు ఈ లేడీ గ్యాంగ్ అంతకంటే ఎక్కువ ‘టాక్సిక్’గా ఉండబోతోందని ఈ గ్లింప్స్ ద్వారా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పష్టం చేశారు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండియర్ ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయి.
పాన్-ఇండియా లేడీ కాస్టింగ్.. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం పాన్-ఇండియా రేంజ్లో భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. ఈ గ్లింప్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించారు. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ డీగ్లామర్ అండ్ బోల్డ్ అవతార్‌లో సర్ ప్రైజ్ చేశారు. బాలీవుడ్ నటీమణులు హుమా ఖురేషి, తారా సుతారియా లుక్స్ ఎంతో రస్టిక్‌గా ఉన్నాయి. కన్నడ సెన్సేషన్, సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కూడా ఒక ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే దిశగా, ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), యష్‌కు చెందిన సొంత నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఆగస్ట్ 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యష్ మాస్ స్వాగ్, దానికి తోడు ఇంతమంది పవర్ఫుల్ లేడీస్ తోడవ్వడంతో ‘టాక్సిక్’ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ బజ్ నెలకొంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













