Donald Trump: ట్రంప్‌కు భారీ ఝలక్.. పౌరసత్వ విషయంలో మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు.. భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనం! | | ACTPnews

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు


Last Updated:

Donald Trump: అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ‘పుట్టుకతో వచ్చే పౌరసత్వం’ (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) హక్కును నియంత్రిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అధినేత ఉత్తర్వులు)ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కొట్టివేసింది.

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు
ట్రంప్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

ఈ చారిత్రాత్మక నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 52 లక్షల నుండి 54 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. ఒకవేళ పుట్టుకతో వచ్చే పౌరసత్వ నిబంధనలలో ఎలాంటి మార్పులు వచ్చినా, అమెరికాలో ఉంటూ పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్న అనేక భారతీయ కుటుంబాలపై ఆ ప్రభావం నేరుగా పడేది.

భారతీయ దంపతులకు అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం లభిస్తుందా?

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం… అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా పౌరసత్వం మంజూరు చేయడం అనేది గత 160 ఏళ్లుగా సాగుతున్న ఆచారం. ప్రస్తుతం సాంకేతికత, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాలలో పెద్ద సంఖ్యలో భారతీయ నిపుణులు H-1B వీసాలపై అమెరికాలో పని చేస్తున్నారు. 14వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం… తల్లిదండ్రులు H-1B ఉద్యోగులైనా, విద్యార్థులైనా, తాత్కాలిక వీసా హోల్డర్లైనా, గ్రీన్ కార్డ్ హోల్డర్లైనా లేదా నాన్-యూఎస్ సిటిజన్లైనా సరే, అమెరికాలో జన్మించిన బిడ్డను సాధారణంగా అమెరికా పౌరుడిగానే పరిగణిస్తారు.

ట్రంప్ ఉత్తర్వులు – కోర్టు తీర్పు ప్రాధాన్యత

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు లేదా H-1B ఉద్యోగులతో సహా తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు లభించే ‘ఆటోమేటిక్ అమెరికా పౌరసత్వాన్ని’ రద్దు చేయాలని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రయత్నించారు. అయితే, అధ్యక్షుడి ఉత్తర్వుల ద్వారా ఈ హక్కును నియంత్రించాలనుకున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఒకవేళ ట్రంప్ ఉత్తర్వులను కోర్టు అనుమతించి ఉంటే, సరైన పత్రాలు లేని (undocumented) తల్లిదండ్రులకు పుట్టే పిల్లలను కూడా చట్టవిరుద్ధమైన నివాసితులుగానే పరిగణించాల్సి వచ్చేది. దీనివల్ల దేశంలో అక్రమ వలసదారుల జనాభా మరింత పెరిగేది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ కుటుంబాలకు అమెరికాలో పుట్టే పిల్లలు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వానికి అర్హత సాధిస్తూనే ఉంటారు.

తల్లిదండ్రులకు వర్తించదు

అయితే, పిల్లలకు వచ్చే పౌరసత్వం తల్లిదండ్రులకు వర్తించదు. H-1B లేదా ఇతర తాత్కాలిక వీసాలపై ఉన్న తల్లిదండ్రులు తమ చట్టపరమైన వలస హోదాను (Immigration Status) స్వతంత్రంగా కొనసాగించుకోవాల్సి ఉంటుంది. అమెరికా వలస చట్టాల ప్రకారం… అమెరికా పౌరసత్వం ఉన్న బిడ్డకు 21 ఏళ్లు నిండే వరకు, ఆ బిడ్డ తన తల్లిదండ్రులకు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం స్పాన్సర్ చేయడానికి వీలుండదు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed