Last Updated:
రంగస్థలం, టెలివిజన్, సినిమా రంగాలలో ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్ సాగించిన ప్రముఖ బ్రిటిష్ నటుడు మైఖేల్ బైర్న్ జూన్ 20న మరణించారు. ‘హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ – పార్ట్ 1’, ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’, ‘బ్రేవ్‌హార్ట్’ చిత్రాలలోని తన పాత్రలకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారు.
హ్యారీ పాటర్ అండ్ ది డెత్ హలోస్ – పార్ట్ 1′ , ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’, ‘బ్రేవ్‌హార్ట్’ చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బ్రిటిష్ నటుడు మైఖేల్ బైర్న్ 82 ఏళ్ల వయసులో మరణించారు. బైర్న్ జూన్ 20న మరణించినట్లు పలు రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. మరణానికి గల కారణం అధికారికంగా వెల్లడి కాలేదు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో, విస్తృతమైన రంగస్థల కెరీర్‌తో పాటు 170కి పైగా చలనచిత్ర, టెలివిజన్ క్రెడిట్‌లతో, బైర్న్ బ్రిటన్ యొక్క అత్యంత నమ్మకమైన క్యారెక్టర్ నటులలో ఒకరిగా పేరు సంపాదించారు మైఖేల్ బైర్న్.
‘హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ – పార్ట్ 1 ‘ (2010) లో వృద్ధుడైన గెల్లెర్ట్ గ్రిండెల్వాల్డ్ పాత్రను పోషించి మరింత పాపులర్ అయ్యాడు మైఖేల్ బైర్న్. ఆ తర్వాత ఈ పాత్రను ‘ఫాంటాస్టిక్ బీస్ట్స్’లో జానీ డెప్, మాడ్స్ మిక్కెల్సెన్ పోషించారు. ది ఈగిల్ హ్యాస్ ల్యాండెడ్ (1976), ఎ బ్రిడ్జ్ టూ ఫార్ (1977), ఫోర్స్ 10 ఫ్రమ్ నవరోన్ (1978), ది ఓమెన్ (1976), టుమారో నెవర్ డైస్ (1997), ది సెయింట్ (1997), ఆప్ట్ ప్యూపిల్ (1998), గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ (2002), ది సమ్ ఆఫ్ ఆల్ ఫియర్స్ (2002), క్వార్టెట్ (2012) మరియు డయానా (2013) వంటి చిత్రాలలో నటించాడు.
నవంబర్ 7, 1943న లండన్‌లోని హాంప్‌స్టెడ్‌లో జన్మించిన బైర్న్, 1960ల ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన లారెన్స్ ఒలివియర్ యొక్క నేషనల్ థియేటర్ కంపెనీతో శిక్షణ పొంది, ప్రదర్శనలు ఇచ్చారు. ‘రోమియో అండ్ జూలియట్’ , ‘ది చెర్రీ ఆర్చర్డ్’ , ‘మచ్ అడో అబౌట్ నథింగ్’, ‘ది సీగల్’ వంటి నాటకాలలో లారెన్స్ ఒలివియర్, మ్యాగీ స్మిత్ మరియు రాబర్ట్ స్టీఫెన్స్ వంటి ప్రఖ్యాత నటులతో కలిసి నటించారు . ఆయన రంగస్థల ప్రదర్శనలలో లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లో హెరాల్డ్ పింటర్ దర్శకత్వం వహించిన బట్లీ, రాయల్ కోర్ట్ థియేటర్‌లో ‘ డెత్ అండ్ ది మెయిడెన్’ కూడా ఉన్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 01, 2026 12:55 PM IST













