Last Updated:
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నారట.
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో పాటు థియేటర్లను ఊపేసే స్పెషల్ సాంగ్స్ (ఐటెం నంబర్స్) ఎంతటి సంచలనం సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కథతో సంబంధం లేకుండా బాలయ్య వేసే మాస్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ‘వీర సింహారెడ్డి’ చిత్రంలోని ఐటెం సాంగ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో రచ్చ చేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సరికొత్త కసరత్తులు ప్రారంభించారు.
నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 111’ (వర్కింగ్ టైటిల్). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమా చివర్లో ఐటెం సాంగ్స్ షూట్ చేస్తుంటారు, కానీ గోపీచంద్ మాత్రం ఇప్పుడే ఈ పాటను చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారు. ఈ మాస్ నంబర్ కోసం బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని సంప్రదించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆమె టీమ్‌తో చర్చలు ముగిశాయని, ఆల్మోస్ట్ ఆమె పేరే ఖరారైనట్లు తెలుస్తోంది.
‘రాక్‌స్టార్’ సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి ‘మద్రాస్ కేఫ్’, ‘మెయిన్ తేరా హీరో’, ‘హౌస్ ఫుల్’ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఫక్రీకి ఇది క్రేజీ ఆఫర్ అని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో ఆమె రోషనార పాత్రలో నటించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం, సమీకరణాలు మారడంతో ఆమె స్క్రీన్‌పై కనిపించలేదు. ఒకవేళ బాలయ్య సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ గనుక లాక్ అయితే, ఇదే నర్గీస్‌కు టాలీవుడ్లో అధికారిక తొలి చిత్రం (Debut) అవుతుంది.
‘NBK 111’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈయనే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి కూడా నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య-తమన్-గోపీచంద్ కాంబో అంటేనే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













