Bandi Sanjay Son: బండి సంజయ్‌కి సన్ స్ట్రోక్.. భగీరథ్ హనీట్రాప్, పోక్సో కేసుతో పొలిటికల్ లైఫ్ ఖతమేనా..! | ట్రెండింగ్ | ACTPnews

Bandi Sanjay Son


Last Updated:

Bandi Sanjay Son: బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవి పోవడం ఖాయమా..? గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూనివర్సిటీలో తన తోటి స్టూడెంట్‌ని కొట్టిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ మరోసారి తండ్రి పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Bandi Sanjay Son
Bandi Sanjay Son

Bandi Sanjay Son: బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవి పోవడం ఖాయమా..? గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూనివర్సిటీలో తన తోటి స్టూడెంట్‌ని కొట్టిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ మరోసారి తండ్రి పరువు, ప్రతిష్టకు భంగం కలిగించే పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈసారి ఆరోపణలు కాకుండా కేంద్రమంత్రి కొడుకుపై పోక్సో కేసు కూడా నమోదవడం రాజకీయంగా రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో ఈ పొలిటికల్ అలిగేషన్ పెద్ద రచ్చ రచ్చ అవుతోంది. అయితే సాయి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన వారిపై కూడా బండి సంజయ్ వారసుడు కంప్లైంట్ చేశాడు. తనతో పరిచయం ఉన్న యువతిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు బలవంతం పెట్టారని అందులో భాగంగానే బ్లాక్ మెయిల్ చేస్తే గతంలో కొంత డబ్బు ఇచ్చినట్లుగా భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పుడు మరో రూ.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారని అందుకు నిరాకరించినందుకే అతనిపై పోక్సో కేసు పెట్టారని తెలుస్తోంది. అయితే సదరు యువతి తల్లిదండ్రులు మాత్రం తమ మైనర్ కూతుర్ని తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేసినట్లుగా మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అయితే భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి హోదాలో ఉండటంతో కేసు పెట్టే విషయంలో కాస్త పోలీసులు తాత్సారం చేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. హనీట్రాప్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేరు ఉండటం, అతనిపై పోక్సో కేసు నమోదవడంతో సోషల్ మీడియాలో బండి సంజయ్ ని పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నేరచరిత్ర కలిగిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని అతనికి కేంద్రం హోంశాఖ సహాయమంత్రి పదవిలో ఎలా కొనసాగిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హనీట్రాప్ కేసులో చిక్కుకున్న బండి సంజయ్ సన్..

కరీంనగర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. గత మూడ్రోజులుగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌ నేతల మధ్య విభేదాలు, దాడులు, కేసులతో హాట్ హాట్‌గా మారిన సమయంలో కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ హనీట్రాప్ ఆరోపణలు, అతనిపైనే పోక్సో కేసు నమోదవడంపై చర్చ జరుగుతోంది. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకొని పోక్సో ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయట పడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసింది. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన బండి సాయి భగీరథ్ శుక్రవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఇదే అంశాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రుల నుంచి వేధింపులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆ అమ్మాయి తనతో స్నేహం చేసిందని, ఫంక్షన్లు, కుటుంబంలో జరిగే శుభ కార్యాలకు తనను పిలిచేదని వివరించాడు. ఆమెతో కలిసి పవిత్ర పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తిరిగానని పేర్కొన్నారు. కొద్ది నెలల తరువాత పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిందని, దీంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు కూడా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అడిగినంతగా డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని, ఇద్దరూ శారీరకంగా కలిసినట్లు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని తెలిపారు. బెదిరింపులు తట్టుకోలేక రూ.50వేలు అమ్మాయి తండ్రికి చెల్లించానని పేర్కొన్నారు. ఈ డబ్బులతో సంతృప్తి చెందకపోగా మరో రూ.5 కోట్లు తన నుంచి డిమాండ్ చేశారని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అమ్మాయి తల్లి బెదిరింపులకు దిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కరీంనగర్ టౌ టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు రాగా అర గంట వ్యవధిలో అనగా 5.30 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 308(5), 351(2), ఆర్ డబ్ల్యూ 3 (5) కింద కేసు నమోదు చేశారు.

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు..

కరీంనగర్ టూ టౌన్‌లో బండి సంజయ్ కొడుకు కంప్లైంట్‌తో బాధిత యువతి తల్లిదండ్రులపై కేసు నమోదైన కొద్ది సమయంలోనే వాళ్లు కూడా హైదరాబాద్‌ పేట్ బషిరాబాద్‌లో పోక్సో కేసు పెట్టారు. 17 ఏళ్ల వయసున్న తమ కూతురికి డ్రగ్స్ అలవాటు చేసి మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు పెట్టాలని పోలీసులను కోరారు. కేసు పెట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తల్లిదండ్రులు తీవ్రంగా హెచ్చరించడంతో తప్పని స్థితిలో వారి నుంచి ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేశారంటున్నారు. ఈ పరస్పర ఆరోపణలపై రెండు చోట్ల ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ కాపీలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండి భగీరథ్‌పై కంప్లైంట్ చేసిన యువతి తల్లిదండ్రుల్లో మహిళ కీలక పాత్ర పోషించడంతో ఆమె గత చరిత్ర ఏంటీ.. ఏదైనా కేసులు ఉన్నాయా.. ఇదే తరహాలో హనీట్రాప్‌ చేపట్టిందా అని విచారిస్తున్నారు పోలీసులు.

ఫైర్ బ్రాండ్ లీడర్‌ పొలిటికల్ కెరియర్..?

మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న బండి సంజయ్‌ పేరును కొడుకు భగీరథ్ బజారుకీడుస్తున్నాడని.. రాజకీయంగా ఆయనకు అపకీర్తిని తెచ్చిపెడుతున్నాడనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ కేసు నేపథ్యంలో గతంలో యూనివర్సిటీలో సహచర విద్యార్థిపై దాడి చేసిన వీడియో కూడా మరోసారి వైరల్ అవుతోంది. యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో అప్పుడు దుండిగల్ పోలీసులు భగీరథ్ పై కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. ఇది జనం మర్చిపోయిన కొద్దిరోజుల్లోనే మరో వివాదంలో చిక్కుకోవడంతో బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ కొడుకు వల్లే నాశనం అయ్యేలా ఉందనే టాక్ కూడా నడుస్తోంది. అంతే కాదు గతంలో యూనివర్సిటీలో తోటి స్టూడెంట్‌ని కొట్టిన సమయంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బండి భగీరథ్‌ని ఇరాక్ నియంత సద్దాం సుస్సేన్ కొడుకు ఉదయ్ హుస్సేన్‌తో పోల్చిన ట్వీట్‌ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

బీజేపీకి పెద్ద దెబ్బే..

ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. ఈసమయంలో బండి సంజయ్ కుమారుడి వివాదాల వ్యవహారం ఆ పార్టీ ఇమేజ్‌కి డ్యామేజ్ తెచ్చి పెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు గత మూడ్రోజులుగా కరీంనగర్ లో బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆఫీసుపై దాడి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి అంశాలు కూడా ఆపార్టీని కొంత కష్టాల్లో పడేసేలా ఉందంటున్నారు. అయితే బీజేపీ దూకుడు తగ్గించడానికే బండి సంజయ్ కుమారుడి హనీట్రాప్ కేసుని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports